కరోనా విలయతాండవాని ప్రపంచం మొత్తం 38.21 లక్షలకు చేరిన భాదితులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

కరోనా విలయతాండవాని ప్రపంచం మొత్తం 38.21 లక్షలకు చేరిన భాదితులు


అంతర్జాతీయం : కరోనా విలయతాండవానికి ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 2,65,045 మంది ప్రాణాలు కోల్పోగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 38.21 లక్షలు దాటింది. ఈ వైరస్‌ నుంచి 12.99 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికాలో కరోనాతో 74,799 మంది చనిపోగా, నిన్న ఒక్కరోజే 2,528 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 25,857, ఇటలీలో 29,684, యూకేలో 30,076, ఫ్రాన్స్‌లో 25,809, జర్మనీలో 7,275, రష్యాలో 1,537, టర్కీలో 3,584, బ్రెజిల్‌లో 8,588, ఇరాన్‌లో 6,418, కెనడాలో 4,232, బెల్జియంలో 8,339, నెదర్లాండ్స్‌లో 5,204 మంది ప్రాణాలు కోల్పోయారు.

Post Top Ad