ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిన్న 47 మందికి కరోనా పాజిటివ్ : 488 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిన్న 47 మందికి కరోనా పాజిటివ్ : 488 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

87883e91428c2681e7100ae2713e5ff0

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 47 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్లు దీంతో ఇప్పటి వరకు మొత్తం 488 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 6,534 శాంపిల్స్‌ను పరీక్షించగా, కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు మొత్తం 1,583 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో 1,062 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్‌ విధానంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో 835 స్పెషలిస్ట్‌లు నియామకానికి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 235 స్పెషలిస్ట్‌ పోస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు.