శుభ తెలంగాణ (03 ,మే , 2020 - కొంపల్లి ) : కొంపల్లి పురపాలక సంఘం పరిధిలోని గృహసముదాయాల ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కొంపల్లి పురపాలక సంఘం చైర్మెన్ మరియు మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎర్లీ బర్డ్ పథకం ద్వారా పట్టణం లోని గృహసముదాయాల యజమానులు ఎలాంటి, గత పన్నుల బకాయిలు లేకుండా చెల్లించినవారికి, 2020-21 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించి చెల్లించవలసిన ఆస్తి పన్నులను మే 31 లోపు చెల్లించినచో వారు చెల్లించే ఆస్తి పన్నులో 5% తగ్గింపు ఇవ్వబడును అని తెలిపారు. ఇట్టి ఎర్లీ బర్డ్ పథకం సంవత్సర ఆస్తి పన్ను 30 వేల లోపు ఉన్న గృహసముదాయముల యజమానులకు మాత్రమే వర్తించును. కావున ప్రభుత్వం కల్పించిన ఇట్టి సదవకాశాన్ని పట్టణ ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోని సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించగలరని మున్సిపల్ కమిషనర్ కోరారు.
Post Top Ad
Sunday, May 03, 2020
కొంపల్లి వాసులకి గుడ్ న్యూస్ : మున్సిపాలిటీ ఆస్తి పన్నుల చెలింపులో 5% తగ్గింపు
Admin Details
Subha Telangana News