మహిళలకు శుభవార్త : మరో మూడు నెలల పాటు రూ.500 చొప్పున సాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

మహిళలకు శుభవార్త : మరో మూడు నెలల పాటు రూ.500 చొప్పున సాయం


శుభ తెలంగాణ (03 ,మే , 2020 -జాతీయం ) : దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 17వరకు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించింది. లాక్ డౌన్ కారణంగా కేంద్రం జన్ ధన్ యోజన అకౌంట్లు ఉన్న మహిళలకు మూడు నెలల పాటు విడతల వారీగా రూ.500 చొప్పున సాయం చేస్తానన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలకు సంబంధించి తొలి విడత నగదు రూ.500 కేంద్ర సర్కార్ అర్హుల అకౌంట్లలో ఇప్పటికే జమ చేసింది. తాజాగా మే నెలకు సంబంధించి రెండో విడత నగదును జమ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈ డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు పలు సూచనలను కూడా కేంద్రం చేసింది. అకౌంట్ నంబర్ చివర్లో 0, 1 ఉన్న ఖాతాదారులు సోమవారం తమ సొమ్మును తీసుకోవాలన్న కేంద్రం సూచించింది. ఖాతా చివర్లో 2,3 అంకెలు ఉన్న వాళ్లు మే 5వ తేదీన తీసుకోవాలని సూచించింది. అకౌంట్ చివర్లో 4, 5 ఉన్నవాళ్లు మే 6న డబ్బులు తీసుకోవాలని, ఖాతా చివర్లో 6,7 నెంబర్లు ఉన్నవాళ్లు మే 8న డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక ఖాతా చివర్లో 8,9 ఉన్న వాళ్లు మే 11న తమ సొమ్మును తీసుకోవాలని తెలిపింది. బ్యాంకుల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిబంధనలు పెట్టింది. అయితే మే 11 తర్వాత కూడా ఎప్పుడైనా నగదును డ్రా చేసుకోవచ్చు. చెప్పిన తేదీలలో నగదు డ్రా చేసుకోకపోయినా జమ అయిన నగదు ఎక్కడికి పోదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కేంద్రం జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆర్థిక సాయం చేస్తోంది.