దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా : 56 వేలు దాటినా భాదితులు : - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా : 56 వేలు దాటినా భాదితులు :


జాతీయం : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు 56 వేలు దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రినాటికి ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,811కు చేరింది. కాగా గడచిన 24 గంటల్లో దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. కేరళ, జమ్ముకశ్మీర్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Post Top Ad