నేటి నుంచి 6 కొత్త రూల్స్... బ్యాంక్ కస్టమర్లు, రైల్వే ప్రయాణికులపై ప్రభావం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

నేటి నుంచి 6 కొత్త రూల్స్... బ్యాంక్ కస్టమర్లు, రైల్వే ప్రయాణికులపై ప్రభావం

శుభ తెలంగాణ(1, ఏప్రిల్ , 2020) :  నేటి నుండి పలు అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లు, రైల్వే ప్రయాణికులపై నేరుగా పై ప్రభావం పడబోతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచే మారే అంశాలు ఏంటో చూద్దాం.

1. స్టేట్ బ్యాంక్ (SBI) తన సేవింగ్స్ డిపాజిట్, షార్ట్ టర్మ్ లోన్ రేట్లను రెపో రేటుతో అనుసంధానం చేసింది. ఎటర్నల్ బెంచ్మర్క్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

2. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన డిజిటల్ వాలెట్ సర్వీసులను రద్దు చేసింది. పీఎ్న కిట్టీ వాలెట్ సేవలను ఇక కస్టమర్లు పొందలేరు. కస్టమర్లు ఈ వాలెట్లోని డబ్బులను ఇతర అకౌంట్లను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.

3. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పెన్షన్ అందించనుంది. దీంతో 6 లక్షల మందికి పైగా పెన్షన్లరకు ప్రయోజనం కలుగనుంది.

4. కరోనా వైరస ను ఎదుర్కోవడానికి ఏటీఎంలను రోజూ శుభ్రం చేయనున్నారు. రోజుకు రెండు సార్లు ఏటీఎంలను శానిటైజర్తో క్లీన్ చేస్తారు. హాట్‌స్పాట్స్ లోని మున్సిపల్ కార్పొరేషన్లు ఈ పని చేస్తాయి. ఒకవేళ శానిటైజేషన్ రూలను అనుసరించకపోతే ఏటీఎంలను క్లోజ్ చేస్తారు.

5. లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం ట్రెన్స్  తిరగకపోయినప్పటికీ మే 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వచ్చింది. కొత్త రూల్ ప్రకారం...
రిజర్వేషన్ చార్ట్ రెడీ కావడానికి 4 గంటల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రయాణానికి కేవలం 24 గంటల ముందు వరకే స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండేది.

6. ఎయిర్ ఇండియా ప్రయాణికులు మే 1 నుంచి టికెట్  క్యాన్సలేషను ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ టికెట్ క్యాన్సలేషన్ చార్జీలను తొలగించింది.

Post Top Ad