దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : 60 వేలు దాటినా భాదితులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 10, 2020

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : 60 వేలు దాటినా భాదితులుశుభ తెలంగాణ (10, ,మే , 2020) - జాతీయం  :  దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యే వేగం పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. నెల ప్రారంభంలో కేసులు రెట్టింపు అయ్యేందుకు 13 రోజులు పట్టగా.. ప్రస్తుతం 10 రోజులకే రెట్టింపు అవుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి పరిశీలిస్తే ప్రతిరోజు దాదాపు 3000 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, తమిళనాడు రాజధాని చెన్నైలో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో (శుక్రవారం నుంచి శనివారం వరకు) దేశంలో 3,320 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,662కు చేరుకుంది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 1,981కి పెరిగింది. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad