జూన్ 6 వరకు కోర్టులు లాక్ డౌన్..! - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 30, 2020

జూన్ 6 వరకు కోర్టులు లాక్ డౌన్..!

రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ ను జూన్ 6 వరకు పొడిగిస్తున్న‌ట్టు హైకోర్టు తెలిపింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ ను పొడిగించిన హైకోర్టు.. అత్యవసర కేసులు సంబంధించిన విచారణ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో ఆన్ లైన్ తో పాటు నేరుగా పిటిషన్లు దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా కోర్టు అవరణల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.