మే 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా కఠినంగా లాక్డౌన్ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

మే 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా కఠినంగా లాక్డౌన్ అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ


శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ ) : తెలంగాణ సర్కార్ మే 7 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర సర్కార్ పలు సడలింపులు ఇచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం దానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. మే 7 వరకు తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం. మే 5న తెలంగాణ కేబినేట్ భేటి కానుంది. ఈ కేబినేట్ భేటిలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు  కానున్నాయి. తెలంగాణలో కేంద్రం సడలింపులు ఇచ్చినట్టుగా సడలింపులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.