తెలంగాణలో శనివారం ఒక్కరోజులో 74 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 14 కరోనా కేసులు విదేశీయులు, వలసకార్మికులకు చెందినవి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2068 అని హెల్త్ బులెటిన్లో వివరించారు. అయితే, శనివారం మరో ఆరుగురు కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 77కు చేరుకుంది.గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధుల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదుకావడం కలవర పరుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 41, రంగారెడ్డి జిల్లాలో 5, మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాల్లో 2 కేసుల చొప్పున, సంగారెడ్డిలో 3, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో 9 మంది వలస కార్మికులకు, మరో ఐదుగురు వలస కార్మికులకు కరోనా సోకింది.
Post Top Ad
Sunday, May 31, 2020
భయపెడుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాల్లో మళ్లీ.. 77కి చేరిన మృతులు
Admin Details
Subha Telangana News