రాజ‌మౌళి కుటుంబాన్ని ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటాం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

రాజ‌మౌళి కుటుంబాన్ని ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటాం

డెస్క్, ఫొటో, వీడియో జ‌ర్న‌లిస్టుల‌నే తేడాలు లేకుండా అంద‌రినీ స‌మానంగా చూస్తున్న ప్ర‌భుత్వం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర‌మేన‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే జ‌ర్న‌లిస్టుల‌కు మొద‌టిసారి ప్ర‌త్యేక నిధిని పెట్టి, ఆదుకుంటున్న ప్ర‌భుత్వం కూడా ఒక్క కేసీఆర్ దేన‌ని ఆయ‌న అన్నారు. ఈ మ‌ధ్యే బ్రెయిన్స్ స్ట్రోక్ తో హ‌ఠాన్మ‌ర‌ణం పొందిన ఈనాడు ప‌త్రిక సీనియ‌ర్ ఫొటో జ‌ర్న‌లిస్టు రాజ‌మౌళి కుటుంబాన్నిమ‌ల్కాజిగిరిలోని వారి నివాసానికి వెళ్లి మంత్రి ప‌రామ‌ర్శించారు. 
రాజ‌మౌళి చిత్ర‌పటానికి పూలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రాజ‌మౌళి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జ‌నం కోసం పాటు ప‌డే జ‌ర్న‌లిస్టులు వారి వ్య‌క్తిగ‌త జీవితం, సొంత కుటుంబాల గురించి కూడా ఆలోచించాల‌న్నారు. రాజ‌మౌళి కుటుంబాన్ని ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటామ‌ని చెప్పారు.