వలస కార్మికులకు అండగా నిలిచిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

వలస కార్మికులకు అండగా నిలిచిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.

శుభ తెలంగాణ (శేరిలింగంపల్లి) : తెలంగాణ అభివృద్ధిలో భాగం అయిన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నుండి వచ్చిన వలస కూలీలను ఆదుకోవాలని కేసీఆర్, కేటీఆర్ మరియు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిలుపునివ్వడంతో కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్... మెహిదీపట్నం నుండి ఉత్తర ప్రదేశ్ గోరక్ పూర్ వెళ్తున్న 15 మంది వలస కూలీలకు తన కార్యాలయంలోనే వసతి కల్పించి భోజన సౌకర్యాలు కల్పించారు. పొట్ట చేతన పట్టుకొని వచ్చిన వలస కూలీలు కరోనా మహమ్మారి దెబ్బకు తిండి తిప్పలు లేక అడిగేవారు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో బట్టలు మూట చేతబట్టుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, పుట్టిన ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా వారిని చూసి ఆపి వారికి షెల్టర్ ఇవ్వడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురి కావద్దని లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా, అన్ని రోజులు భోజన వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వారితో కలసి భోజనం చేశారు.