అంబీర్ చెరువు సుందరీకరణపై ఎమ్మెల్యే సమీక్ష - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

అంబీర్ చెరువు సుందరీకరణపై ఎమ్మెల్యే సమీక్ష

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ చెరువు సుందరీకరణపై గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ గోపి (ఐఎఎస్), ఇరిగేషన్ శాఖ అధికారులతో పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే
మాట్లాడుతూ.. అంబీర్ చెరువు సుందరీకరణలో భాగంగా బతుకమ్మ ఘాట్ ఏర్పాటు, అలాగే ప్రగతి నగర్ భూగర్భ డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి డైవర్షన్ పైప్ లైన్ నిర్మాణ
పనులు చేపట్టాలని, అందుకు కావలసిన వ్యయ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్
డిఈ నరేందర్, ఏఈఈ విశ్వం, ఏఈ రామారావు, డిఈ సత్యనారాయణ, ఏఈ వైశం పాయి పాల్గొన్నారు.

Post Top Ad