సాహెబ్ నగర్, పద్మావతినగర్ కాలనీలలో కరోనా కట్టడికి చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

సాహెబ్ నగర్, పద్మావతినగర్ కాలనీలలో కరోనా కట్టడికి చర్యలు

శుభ తెలంగాణ (23,మే ,2020) : కరోనా నివారణకు చర్యలో భాగంగా ఎల్.బీ.నగర్ నియోజకవర్గ పరిధిలోని సాహెబ్ నగర్, పద్మావతినగర్ కాలనీలలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దు లచ్చిరెడ్డి మరియు మహేష్ కొంగర ఆధ్వర్యంలో సోడియం హైడ్రో క్లోరేట్ స్ప్లే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ బయటకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, నరేష్, రాము, శ్రీకాంత్(టిల్లు), హరీష్, సహదేవ్, శంకర్, సాయి ప్రసాద్, సిద్ధు, చింటూ తదితరులు పాల్గొన్నారు.