మున్సిపాలిటీ పరిధిలో దుకాణాలు వంతుల వారీగా తెరవాలి: కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

మున్సిపాలిటీ పరిధిలో దుకాణాలు వంతుల వారీగా తెరవాలి: కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక


శుభ తెలంగాణ (07, మే , 2020) : మున్సిపాలిటీ పరిధిలో దుకాణాలు వంతుల వారీగా తెరవాలని కరీంనగర్ జిల్లా పాలనాధికారి కె.శశాంక కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించామన్నారు. ఇప్పటికే మెడికల్  దుకాణాలు, నిత్యావసర వస్తువులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం, చికెన్ దుకాణాలు, నిర్మాణ పనులు, వ్యవసాయ సంబంధ దుకాణాలు యథావిధిగా నిర్వహిస్తారని, అలాంటి దుకాణాలకు నెంబర్లు ఇవ్వకూడదన్నారు. 65 ఏళ్లు  దాటిన వృద్ధులు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ల వారీగా నెంబర్లు వేసిన దుకాణాల వివరాలు అందించాలన్నారు.


Post Top Ad