అనాధ పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలు: మేడ్చల్ మండల టి.ఆర్.ఎస్.పార్టీ యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

అనాధ పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలు: మేడ్చల్ మండల టి.ఆర్.ఎస్.పార్టీ యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి


శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - మేడ్చల్ ) : మేడ్చల్ మండల టి.ఆర్.ఎస్.పార్టీ యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మేడ్చల్ చెక్ పోస్ట్ సమీపంలోని అనాధ పిల్లలతో కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు భోజనం ఏర్పాటు చేయించి వారితో పాటు భోజనం చేశారు. పిల్లలకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హారత్ రెడ్డి మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలు అనాధ ఆశ్రమంలోని పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. జన్మదిన వేడుకలలో రవలకోల్ సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ రాజా రామ్, టి.ఆర్.ఎస్.పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు సంతోష్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Post Top Ad