గుట్కా తయారీ కేంద్రాల పై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

గుట్కా తయారీ కేంద్రాల పై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి


శుభ తెలంగాణ (08, మే , 2020 - వరంగల్ ) : వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల శివనగర్ లో ప్రభుత్వ నిషేధిత గుట్కాను రహస్యంగా తయారీ చేస్తున్న స్థావరాలపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ సిఐ నందిరామ్  నాయక్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా గుట్క నిల్వల తో పాటు గుట్కాల తయారీ మిషన్ స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే... పాన్  మసాలా పేరుతో గుట్కాలు తయారు చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నంది రామ్, సిబ్బంది కలిసి శివ నగర్ లోని వలాల రాజమల్లు ఇంటిని తనిఖీ చేయగా తన ఇంటి లోపల సదరు వ్యక్తి కొంతకాలం నుండి గుట్కాలు తయారీకి ఉపయోగించే కీమామ్, జర్దా, పొగాకు, తదితర ముడి పదార్థాలను వాడి గుట్కాలు  తయారు చేస్తున్నాడు. ఈ విధంగా తయారు చేసిన గుట్కాలు 21 పాన్ మసాలా, 999 పాన్ మసాలా, kk పాన్ మసాలా పేరుతో నగరంలోని
పాన్ షాపులలో, కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నాడు. పుప్పాల గుట్ట లోని ఒక ఇంటిని కిరాయికి తీసుకొని ఆ ఇంటి లోపల ప్యాకింగ్ యంత్రం సహాయంతో వాటిని ప్యాకింగ్ చేస్తున్నాడు. వాటిని స్వాధీనం చేసుకొని, అనంతరం పుప్పాల గుట్టలోని తన కిరాయి ఇల్లును సోదా చేయగా ప్యాకింగ్ యంత్రం కూడా ఉన్నది. ఈ యంత్రాలను మిల్స్ కాలనీ ఎస్సై సతీష్ కి అప్పగించారు.