శుభ తెలంగాణ (19, మే , 2020) : రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 రోజుల విరామం తర్వాత మళ్లీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ బస్సులు నడుపుకొనేం దుకు ప్రభుత్వం అనుమతినివ్వటంతో ఆర్టీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభం అవుతున్నాయి.కరోనా నిబంధన ల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ ప్ర యాణికులను తరలిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించబోమని వెల్లడించారు. తొలుత భౌతిక దూరంలో భాగంగా రెండు సీట్ల వరసలో ఒకరిని, మూడు సీట్ల వరసలో ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమకు అలాంటి ఆదేశాలు ఏవీ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంటే.. అన్ని సీట్లలో ప్రయాణికులను అనుతిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదేమాట అధికారులను అడిగితే.. భౌతికదూరం పాటిస్తామని మాత్రమే చెబుతున్నారు, సీట్ల మధ్య దూరం ఏర్పాటు గాని, కొన్ని సీట్లను ఖాళీగా ఉంచే ఆలోచన కానీ ఉందా అంటే సమాధానం దాటవేస్తున్నారు.మధ్యలో చెకింగ్ సిబ్బంది వచ్చే సమయంలో వీటిని ఉల్లంఘిస్తూ దొరికిన ప్రయాణికులకు ఫైన్ విధించనున్నారు. మాస్కు లేకుంటే రూ.వేయి జరిమానా ఇక్కడా వర్తిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు.
Post Top Ad
Tuesday, May 19, 2020
ఇవాళ్టి నుండే తెలంగాణ లో బస్సుల రాకపోకలు
Admin Details
Subha Telangana News