గజ్వేల్: కాసేపట్లో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమయ్యే క్షణం సమీపించింది. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జీయర్ స్వామితో కలిసి మర్కూక్ పంప్ హౌస్ స్విచ్చాన్ చేసి కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జిలాలలను విడుదల చేస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇద్రకరణ్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, May 29, 2020
సుదర్శనయాగంలో పాల్గొన్న కేసీఆర్, చినజీయర్ స్వామి
Admin Details
Subha Telangana News