ప్రస్తుత సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి గంగుల కమలాకర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

ప్రస్తుత సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి గంగుల కమలాకర్


శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - కరీంనగర్ ) : ప్రస్తుత సీజన్ లో రికార్డు స్థాయిలో 20 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గత చరిత్రను పరిశీలించినా 20 రోజుల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని చెప్పారు. వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటివరకు 4.20 లక్షల మంది రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తుండగా బిజెపి, కాంగ్రెస్ నాయకులు హర్షించకుండా విమర్శలు చేయడం తగదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 14 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారని పేర్కొ నడం విడ్డూరంగా ఉందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా రెండో నెల కూడా ఒక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వడం ప్రారంభమైందని, మూడు రోజుల్లో 9. 70 లక్షల కార్డుదారులు బియ్యం తీసుకున్నారని చెప్పారు.

Post Top Ad