పాత్రికేయుల సేవలు అమూల్యమైనవి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

పాత్రికేయుల సేవలు అమూల్యమైనవి

కరోనా వైరస్ యావత్ మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. గురువారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలో వరంగల్
చిన్న పత్రిక జర్నలిస్టులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ...కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా రంగంలో పని చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని అన్నారు. తమ వంతుగా 20 మంది చిన్న
పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులకు భరోసానివ్వటంలో భాగంగా పలువురికి నిత్యావసర సరుకులు అందించటం జరిగిందని అన్నారు.