జాతీయం : వలస కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్ చెల్లిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం తెలిపారు. కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్ చెల్లిస్తుందని, ఇది వలసకార్మికులకు కాంగ్రెస్ అందిస్తున్న సహకారమని, వారికి సంఘీభావంగా నిబడతామని ఆమె ఒక లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిపట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న కేంద్రం వలసకార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ''వలసకార్మికులు దేశాభివృద్ధిలో భాగస్వాములని అన్నారు. విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించడం తమ భాద్యతగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఆహారం, రవాణా కోసం రూ. వందకోట్లు వెచ్చించిందని విమర్శించారు. గుజరాత్లో ఒక్క ప్రజా కార్యక్రమం కోసం రైల్వే శాఖ రూ. 151 కోట్లు విరాళంగా ప్రకటించినపుడు, వలసకార్మికులను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఉచిత రైలు ప్రయాణం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.
Post Top Ad
Monday, May 04, 2020
Admin Details
Subha Telangana News