పోలీస్ క్వార్టర్స్‌ భవనం పైనుంచి పడి ఏఎస్ఐ మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

పోలీస్ క్వార్టర్స్‌ భవనం పైనుంచి పడి ఏఎస్ఐ మృతి

మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్ క్వార్టర్ భవనం పైనుంచి పడి ఏఎస్ఐ మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు క్వార్టర్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఆదివారం (మే 31) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బోథ్ మండలం కరత్వాడ గ్రామానికి చెందిన ఎ. ఓదేలు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జన్నారంలోని పోలీస్ క్వార్టర్స్ తనకు కేటాయించిన గదికి వచ్చారు.

ఏఎస్‌ఐ ఓదేలు ఆదివారం ఉదయం పోలీస్ క్వార్టర్ భవనం పైనుంచి కాలు జారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయన గొంతుకు రేకు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావమైంది. అది గుర్తించిన క్వార్టర్‌లోని ఇతర సిబ్బంది ఆయణ్ని హుటాహుటిన మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా ద్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు.