కోట్లల్లో డబ్బులు తీసుకొని : భారత్ లోకి కరోనా తెచ్చిన తబ్లీగ్ జమాత్ పెద్దలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

కోట్లల్లో డబ్బులు తీసుకొని : భారత్ లోకి కరోనా తెచ్చిన తబ్లీగ్ జమాత్ పెద్దలు


శుభ తెలంగాణ (02 ,మే , 2020 - జాతీయం ) :  గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనం రేపింది. నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తోపాటు అతని సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి నిధులు వచ్చాయని తేలింది. జమాత్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన కోట్లాదిరూపాయల నగదు వివరాలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు. మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ డబ్బు వచ్చిందని సమాచారం. ఇటీవల ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు సాద్ ఫాంహౌస్ పై దాడి చేసినపుడు రూ.2కోట్ల అంతర్జాతీయ నిధులతో ఆస్తులు కొన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. మర్కజ్ కు విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు వచ్చాయా? మనీలాండరింగ్ కు పాల్పడ్డారా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. నిజాముద్దీన్ లో సమావేశం పెట్టి దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమయ్యారని పోలీసులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తంమీద తబ్లీగ్ జమాత్ చీఫ్ కు విదేశీ నిధుల రాకపై పోలీసులు ఇచ్చిన నివేదికతో ఈడీ అధికారులు సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.