మున్సిపల్ కార్మికులకు, నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన స్వామి విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్: పాలూరి లక్ష్మణ్ స్వామి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

మున్సిపల్ కార్మికులకు, నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన స్వామి విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్: పాలూరి లక్ష్మణ్ స్వామి

శుభతెలంగాణ(02మే20)విశాఖపట్నం జిల్లా గాజువాక లోని స్వామి విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ పాలూరి లక్ష్మణ స్వామి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులకు,నిరుపేదలకు సామాజిక దూరం పాటిస్తూ ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.. అనంతరం స్వామి విద్యా నికేతన్  ప్రిన్సిపాల్ పాలూరి లక్ష్మణ స్వామి మాట్లాడుతూ... కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిరుపేదలు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని. 
నిరుపేదలను ఆదుకునే అవసరం ఎంతైనా మనందరి పై ఉందని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం చేసి నిరుపేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా G.V.M.C ప్రత్యేక అధికారి బి.వి.రమణ, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు టీ.శ్రీరామ్ మూర్తి, జె.వి.వి పట్టణ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్,స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ కమిషనర్ ఎస్. వి రమణ.ఈ కార్యక్రమంలో జిప్సా మాజీ అధ్యక్షులు ఎస్. వి.కె పరశురామ్,ఎక్స్ లెంట్ సత్య , కే.దివాకర్,ఏ.వాసుదేవరావు, విందు గిరి మరియు స్కూల్ కరస్పాండెంట్ లు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు...