మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టు లకి సరకుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టు లకి సరకుల పంపిణీ

శుభ తెలంగాణ (25,మే,2020) : కూకట్పల్లి బొమ్మ శ్రీధర్ : 
• జర్నలిస్టుల సమస్యలు తనకు తెలుసని, కలెక్టర్ కాక ముందు నేను కూడ జర్నలిస్ట్ నే అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

 • ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్లకు కలయిక అని అదనపు కలెక్టర్ విద్య సాగర్ రావు అన్నారు.

 మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ లో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్‌లకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ విద్యా సాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కాక ముందు నేను కూడా జర్నలిస్ట్ నే, జర్నలిస్ట్‌ల సమస్యలు అనేక సమస్యలు ఉంటాయని అయిన వాటిని అధికమించి కరోనా కాలం లో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్ లను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం లోని మొట్ట మొదటిసారిగా జర్నలిస్ట్‌లకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్లకు కలయిక అని అదనపు కలెక్టర్ విద్య సాగర్ రావు అన్నారు. జర్నలిస్టులు యూట్యూబ్ చానెల్స్, ఈ-పేపర్స్ ఏర్పాటు చేసుకొని కరోనా కాలంలో, విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్‌లు రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ ఉన్న కూడా పోలీసులు, మెడికల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు జర్నలిస్ట్‌లు  
కూడ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించడంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు సంజీవ రావు, నిర్మల, గౌరీ వస్థల, మహిపాల్, మహిపాల్ రెడ్డి, గీత, నాగమణి, బాలానగర్ సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజు తో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, VRO, VRA లతో పాటు జర్నలిస్ట్‌లు ఎర్ర యాకయ్య, సంపత్ కుమార్, రంగు వెంకటేష్ గౌడ్, శివాజీ, వెంకట్, బలరాజ్ గౌడ్, కోటగడ్డ శ్రీనివాస్, అమరెందర్ గౌడ్, బొమ్మ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.