నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన "టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన "టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి

శుభ తెలంగాణ న్యూస్ (19, మే, 2020) : మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్  పరిధిలోని కుషాయిగూడ లో  సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజు 500 మందికి సరుకులు పంపిణీ చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి హాజరై 2 వేల మంది వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎం.పీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... వలస కూలీలకు,నిరుపేదలకు కనీసం భోజన ఏర్పాట్లు చెయ్యటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.ఇతర రాష్ట్రాల వలస కూలీలు,వారి పిల్లలు, వృద్ధులు ఎర్రటి ఎండలో వేల కిలోమీటర్ల నడుస్తూ పిట్టల చనిపోతుంటే కనీసం రవాణా ఏర్పాటు చెయ్యకపోవటం దారుణమని అన్నారు. తినడానికి తిండి లేక, డబ్బులు లేక ఉన్న కూలీలకు అరకొర రైళ్లు ఏర్పాటు చేసి టికెట్ చార్జీలు పెట్టిన ఘనత మీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు పిలుపు మేరకు దేశంలోని వలస కూలీలను కాంగ్రెస్ కార్యకర్తలు తమ స్వంత వాహనాల్లో సరిహద్దుల వరకు చేరవేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, మల్కాజిగిరి అసెంబ్లీ సభ్యులు ఇన్ఛార్జ్ నంది కంటి శ్రీధర్,రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ పత్తి కుమార్,  పరమేశ్వర్‌రెడ్డి, గోగుల సరిత, సీతారాం రెడ్డి,యాదగిరిరెడ్డి,నాను,బాబీ, రాజు, సాయి, మిట్టు, రమణ  తదితరులు పాల్గొన్నారు...
మరిన్ని చిత్రాలు :కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.. ఎంపీ రేవంత్‌రెడ్డి..

Post Top Ad