ఒక్క క్లిక్ తో బిల్డింగ్ పర్మిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

ఒక్క క్లిక్ తో బిల్డింగ్ పర్మిషన్

తెలంగాణ ప్రభుత్వ పురపాలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పురపాలకల్లో పౌర సేవలను త్వరితగతిన పూర్తి అయ్యేలా ఆన్ లైన్ సిస్టమ్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్లు, గ్రేటర్​ హైదరాబాద్​లో భవన నిర్మాణాలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్‌– బీపాస్‌ విధానాన్ని జూన్​2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మున్సిపల్​శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లోనే బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేలా . మీ సేవ సెంటర్లు, పౌర సేవకేంద్రాలతో పాటు సొంతంగా కంప్యూటర్, మొబైల్ యాప్ ద్వారానూ అప్లై చేసుకోవచ్చు. దీనికోసం టీఎస్​‌‌– బీపాస్​పేరుతో ప్రత్యేకంగా వెబ్ ​పోర్టల్​ రూపొందించారు. అప్లికేషన్ లో ఏవైనా ఇబ్బందులుంటే అధికారులతో మాట్లాడేందుకు 040–22666666 టోల్​ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేశారు. టీఎస్ – బీపాస్​ను మొదట పైలట్ ప్రాజెక్టుగా 87 మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 1,100 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీ-పాస్ విధానాన్ని అమలు చేయనుంది రాష్ట్ర సర్కార్.