రంజాన్ సామాగ్రిని అందచేసిన నాయిని రాజేందర్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

రంజాన్ సామాగ్రిని అందచేసిన నాయిని రాజేందర్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గ్రేటర్ వరంగల్ 30వ డివిజన్ రాయపురంలో మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ నసీమ్ జహాన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని పేద ముస్లింలకు రంజాన్ పండుగ సామాగ్రిని అంద చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అద్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు, డివిజన్ అధ్యక్షుడు అంబేద్కర్ రాజు, షకీల్, కృష్ణ, నసీర్ అహ్మద్, సయ్యద్ జావీద్, మున్నా భాయ్ తదితరులు
పాల్గొన్నారు.