కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరు చేసిన నిధుల నివేదిక. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరు చేసిన నిధుల నివేదిక.


శుభ తెలంగాణ (21, మే , 2020) :  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరు చేసిన నిధుల నివేదిక. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద  46,95,800 మంది రైతులకు గాను నేరుగా వారి ఖాతాలలోకి బదిలీ చేసిన నగదు మొత్తం రూ. 939 కోట్లు. ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన (PMJDY) ఖాతాలు కలిగిన 60,22,126 మంది లబ్ధిదారులకు గాను నేరుగా వారి ఖాతాలలోకి  జమ చేసిన మొత్తం రూ. 301 కోట్లు.జాతీయ సామాజిక సహాయ పథకం(NSAP) పథకం కింద 9,32,661 మంది లబ్ధిదారులకు గాను విడుదల చేసిన నగదు రూ. 47 కోట్లు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల(BoCW) నిధి కింద 19,67,484 మంది కార్మికుల ప్రయోజనార్ధం కేటాయించిన నిధులు రూ. 197 కోట్లు. ఎంప్లాయి ప్రోవిడెంట్ ఫండ్ విత్ డ్రాయల్ కింద 27,451 మంది లబ్ధిదారులకు గారు కేంద్రం మంజూరు చేసిన మొత్తం రూ. 92 కోట్లు.  24% ఈపిఎఫ్ కింద 1,41,135 మంది లబ్ధిదారులకు గాను కేంద్రం విడుదల మొత్తం రూ. 21 కోట్లు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(SDRF) కింద విడుదల చేసిన మొత్తం రూ. 559 కోట్లు. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో COVID-19 సహాయ నిధికి గాను కేంద్రం రూ. 178 కోట్లు విడుదల చేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్(41%) కింద రాష్ట్రాలకు మొదటి విడత సెంట్రల్ టాక్సెస్ అండ్ డ్యూటీస్ నిధులలో భాగంగా ఆర్ధిక సంవత్సరం 2020-2021 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 1,893 కోట్లు.కేంద్ర ప్రభుత్వం పై పథకాలకు విడుదల చేసిన నగదు మొత్తం రూ.4,227 కోట్లు.కేంద్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాల కింద విడుదల చేసిన నిధులు.  ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY)కింద 2.64 కోట్లమంది పేదలకు 1,32,159 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. కేంద్రం 90 లక్షల మంది లబ్ధిదారులకు గాను 16,930 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యలు పంపిణీ చేసింది. ఉజ్వలా యోజన పథకం కింద 2,72,179 సిలిండర్లను లబ్ధిదారులకు  ఉచితంగా పంపిణీ చేసింది.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ(వైద్య సహాయం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 3,06,159 ఫేస్ మాస్కులను(N95), a2,12,500  పి.పి.ఈ కిట్లు మరియు 22 లక్షల HCQ టాబ్లెట్లు పంపిణీ చేసింది.అంతేకాకుండా 52 ప్రభుత్వ&ప్రయివేటు ఆరోగ్య పరీక్ష కేంద్రాల(లాబ్స్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.