శుభ తెలంగాణ (08, మే , 2020 - కుత్బుల్లాపూర్ ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గురుమూర్తి నగర్ లో తెల్ల రేషన్ కార్డు లేని నిరుపేదలకు బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... 'కరోనా వైరస్' లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలెవ్వరూ ఆందోళన చెందవద్దని.. తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రాంతి యాదవ్, కాలని అధ్యక్షుడు హర్షద్, కాలని వాసులు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, May 08, 2020
నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Admin Details
Subha Telangana News