"హంగర్ హెల్పర్స్" టీమ్ తమ వంతుగా నిరుపేదలకు,వలస కూలీల కు ఆహారం నిత్యవసర సరుకులు,బిస్కెట్,కూరగాయలు ఉచితంగా పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 10, 2020

"హంగర్ హెల్పర్స్" టీమ్ తమ వంతుగా నిరుపేదలకు,వలస కూలీల కు ఆహారం నిత్యవసర సరుకులు,బిస్కెట్,కూరగాయలు ఉచితంగా పంపిణీ..


శుభ తెలంగాణ న్యూస్(10మే20)మేడ్చల్ జిల్లా లోని మల్కాజిగిరి నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో  హంగర్ హెల్పర్స్ టీమ్ కార్యనిర్వాహకులు రెబ్బ వాసు ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలకు, నిరుపేదలకు ఇంటింటికీ  తిరిగి ఆహారం, నిత్యవసర సరుకులు,కూరగాయలు బిస్కెట్ ఉచితంగా వారికీ అందజేశారు.
ఈ సందర్భంగా హంగర్ హెల్పర్స్ టీమ్ కార్యనిర్వాహకులు రెబ్బ వాసు మాట్లాడుతూ.... లాక్ డౌన్  కారణంగా వలస కూలీలు,నిరుపేదలు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని. వారిని ఆదుకునే అవసరం ఎంతైనా మన అందరి పై ఉందని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా పేద వారి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హంగర్ హెల్పర్స్ టీమ్ సభ్యులు ఏ.సందీప్ మాట్లాడుతూ.. లాక్ డౌన్  మొదలైనప్పటి నుండి మల్కాజిగిరి లో ప్రతిరోజు నిరుపేదలను గుర్తించి వారి వద్దకు వెళ్లి ఆహారం, నిత్యావసర రుకులు,
కూరగాయలు, బిస్కెట్లు పంపిణీ చేశారని తెలిపారు..ఈ కార్యక్రమంలో సి.ఎస్.విగ్నేష్,
ఆర్.అజయ్, ఎస్.నరేష్, జి. బాబుల్లేష్,
ఆర్.రణవీర్ తదితరులు పాల్గొన్నారు...

 మరిన్ని చిత్రాలు:
Post Top Ad