జిహెచ్ఎంసి కార్మికులతో భోజనం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

జిహెచ్ఎంసి కార్మికులతో భోజనం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.


శుభ తెలంగాణ (02 , ఏప్రిల్ , 2020) : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి అశోక గార్డెన్ లో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసి కార్మికులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పంపిణీ చేసి, జిహెచ్ఎంసి కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ... కరోనా వల్ల మేడేను సంతోషంగా జరుపుకోలేకపోతున్నామని, లాక్ డౌన్ నేపథ్యంలో ఆటోలు, లారీ డ్రైవర్లు, అసంఘటిత కార్మికుల ఉపాధికి ప్రమాదంగా పరిణమించిందని చెప్పారు. సొంత నిధులతో జీహెచ్ఎంసీ కార్మికులకు దాదాపు 200 మందికి భోజనం ఏర్పాటు చేసిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కూకట్పల్లి వివేకానంద నగర్డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.