రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట - ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట - ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి :(30/05/2020) ధారూర్ మండలం లోని దోర్నాల్ గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వానకాలం-2020 వ్యవసాయ కార్యాచరణ నియంత్రిత వ్యవసాయ విధానంపై గ్రామస్థాయి లో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని రైతులు అందరూ ఒకే పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను పండించాలని సూచించారు. మక్కజొన్నలు ఈ వర్షాకాలంలో పండించవద్దు అని దానివల్ల భూసారం తగ్గుతుంది అని తెలిపారు. పంటలు పండించే రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు పంటలు ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వ్యవసాయంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పశుగ్రాసానికి అవసరం మేరకు మక్కలు పండించుకోవచ్చు అన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తూ దేశంనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని, రాష్ట్రంలో కరోనా వైరస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం 8,210 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని వికారాబాద్ MLA *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు అన్నారు.ఈ కార్యక్రమంలో MPP విజయలక్ష్మి గారు, ZPTC సుజాత గారు, PACS చెర్మెన్ సత్యనారాయణ రెడ్డి గారు, ఇరిగేషన్ EE గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాంరెడ్డి గారు, ADA వినోద్ గారు, MRO భీమయ్య గారు, స్థానిక సర్పంచ్ సుజాత గారు, AO జ్యోతి గారు, మండల హార్టికల్చర్ ఆఫీసర్ గఫార్ గారు, వైస్ MPP విజయ్ గారు, PACS వైస్ ఛెర్మెన్ రాజు నాయక్ గారు, పార్టీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ PACS చెర్మెన్ హన్మంత్ రెడ్డి గారు, TRS పార్టీ జనరల్ సెక్రెటరీ యూనిస్ గారు, రాములు గారు, రాజు గుప్తా గారు, సంతోష్ కుమార్ గారు, కుమ్మరి శ్రీనివాస్ గారు, అంజయ్య గారు, లక్ష్మయ్య గారు, సుధాకర్ గౌడ్ గారు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.