శుభ తెలంగాణ (1, ఏప్రిల్ , 2020) : వేసవిలో నగర ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని జిల్లా పాలనాధికారి కె.శశాంక అన్నారు. గురువారం అర్బన్ మిషన్ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్, వాటర్ గ్రిడ్, ప్రజారోగ్యశాఖ, ఎస్ఆండ్ టీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 5లోగా ట్రయల్ రన్ నిర్వహించి ప్రతిరోజు నీటి సరఫరా చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్లకు ఇంటర్ కనెక్షన్లతో ప్రతి ఇంటికి భగీరథ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ట్యాంకులను శుభ్రం చేయలని, తాగునీటికి పరీక్షలు చేయాలన్నారు. చేతి పంపులను రిపేరు చేయాలని సూచించారు. వేసవిలో ప్రతిరోజు నీటి సరఫరా చేసే సమయంలో 45 నిముషాల కంటే అదనంగా 15నిముషాలు పెంచాలన్నారు. కమిషనర్ వల్లూరు క్రాంతి, ఎస్ఈ ఎం.భద్రయ్య, కమిషనర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, May 01, 2020
వేసవిలో నగర ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వా రాతాగునీరు సరఫరా : పాలనాధికారి కె.శశాంక
Admin Details
Subha Telangana News