ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే వివేకానంద్

 శుభ తెలంగాణ (08, మే , 2020 - తెలంగాణ ) : ఎమ్మెల్యే వివేకానంద్ 128 చింతల్ డివిజన్ లో రెండో విడతగా 150 నిత్యావసర కిట్లను అందించారు. చింతల్ డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ భౌతిక దూరాన్ని పాటిస్తూ రోడమేష్ నగర్ A లో 50 కుటుంబాలకు, వల్లబాయ్ పటేల్ నగర్ లో 50 కుటుంబాలకు, రోడమే) నగర్ B లో 50  కుటుంబాలకు ఇంటింటికి తిరుగుతు పంపిణీ చేశారు. రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునే గొప్ప మనసుతో మొదటి విడతగా నియోజకవర్గానికి 10,000 నిత్యవసర కిట్లను ఎమ్మెల్యే వివేకానంద్ పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో వార్డు మెంబర్ వహీద్ ఖురేషి, నాజీర బేగం, వల్లభాయ్ పటేల్ నగర్ అధ్యక్షులు శేఖర్ రావు, సలీం భాయ్, షఫీ, ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, కుమార్, వెకంటేష్, జనార్దన్, అనిల్, సంజీవ్ రావు, సాయి కుమార్, రమేష్, జహంగీర్, అంజద్, వీరబాబు, పాంగ రాజు, ఫిరోజ్ తదితరులు  పాల్గొన్నారు.

Post Top Ad