తెలంగాణ : పోలీసు కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి (33) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.తీవ్ర జ్వరంతో వారం రోజులుగా కింగ్‌కోఠి, సరోజినీ ఆస్పత్రుల చుట్టూ తిరిగిన దయాకర్‌రెడ్డికి కరోనా లక్షణాలు లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని మృతుని సోదరుడు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కరోనా పరీక్షలు నిర్వహించాలని పలుమార్లు వైద్యులను కోరినా నిర్వహించలేదని, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే తన సోదరుని మృతికి కారణమైందన్నాడు. సోదరునికి సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికేవాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని దుయ్యబట్టారు.కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన పోలీస్ కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతికి డీజీపీ మహేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. దయాకర్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని గురువారం ట్విట్టర్ ద్వారా డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్ మృతికి నెటిజన్లు కూడా ట్వీట్ల ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రాణాలు అర్పించిన అమర సైనికుడు అంటూ కీర్తించారు. దయాకర్‌రెడ్డి పిల్లలకు స్కూలు విద్య అందించేందుకు సిద్ధమని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునితా క్రిష్ణన్ ముందుకు వచ్చారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
Post Top Ad
Friday, May 22, 2020
కరోనా విధులలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ మృతి : కరోనా సోకిందని ఊహాగానాలు
Admin Details
Subha Telangana News