కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకంశుభ తెలంగాణ (08, మే , 2020 - తెలంగాణ ) : అడ్వకేట్స్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ముక్కల రామకృష్ణ, ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో గురువారం ఉప్పల్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేత సుభాష్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేద మరియు మధ్య తరగతి జూనియర్ అడ్వకేట్ లకి 25 కోట్లు కేటాయించినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన అడ్వకేట్లని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గుర్తు పెట్టుకొని వారి గురించి 25 కోట్లు కేటాయించడం చాల అభినందనీయమని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కొనియాడారు. బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ... ఇటువంటి విపత్కర సమయములో కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ.. అన్ని వర్గాల వారిని కాపాడుతున్నారని వారు మరో ఇరవై ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అని చెప్పారు.

Post Top Ad