మద్యం ప్రియులకి షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం : ఎక్కడో తెలుసా ..? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 10, 2020

మద్యం ప్రియులకి షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం : ఎక్కడో తెలుసా ..?


శుభ తెలంగాణ (10, ,మే , 2020) - ఆంధ్రప్రదేశ్‌ : రాష్ట్రంలో మందుబాబులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే మద్యం ధరలను 75 శాతం పెంచిన ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించేసింది. రాష్ట్రంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కు తగ్గించింది. మద్యపాన నిషేదం కోసం మద్యం దుకాణాలు భారీగా తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడం, మద్యం ధరలను భారీగా పెంచడం, బ్రాండ్లు తగ్గించడం ద్వారా ప్రజలను మద్యానికి దూరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం దుకాణాల వేళలు కూడా తగ్గించేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అందుబాటులో ఉండేలా చేసింది. 
 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad