భీమదేవరపల్లి తహశీల్దార్ కు వినతి ప్రత్రం అందజేసిన బీజేపీ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

భీమదేవరపల్లి తహశీల్దార్ కు వినతి ప్రత్రం అందజేసిన బీజేపీ నాయకులు


శుభ తెలంగాణ (౩, ఏప్రిల్ , 2020 - హైదరాబాద్ ) : కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గలరాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం భీమదేవరపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారికి రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి వివరించడం జరిగింది. రైతుల పండించిన, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువస్తే రైస్ మిల్లర్లు రైతులను తాలు పేరుతో దొచుకుతింటున్నారని ఒక్క క్వింటాల్ ధాన్యానికి 5 కిలోలు వరకు తరుగు తీస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న తరుణంలో వారు ధాన్యం తడవకుండా ఉంచుకోవాడానికి టార్పన్ కవర్లు లేక ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించి, రైస్ మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు టార్పన్ కవర్లు అందజేసి దాన్యాన్ని తొందరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, ధాన్యం తరలింపుకు రవాణా సౌకర్యం కల్పించాలని తహశీల్దార్ ని కోరారు.