చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా.రంజిత్ రెడ్డి, సొంత నిధులతో సరుకులు పంపిణి... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా.రంజిత్ రెడ్డి, సొంత నిధులతో సరుకులు పంపిణి...


శుభ తెలంగాణ (04 ,మే , 2020 - కూకట్ పల్లి ) : కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని శ్రీ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా.రంజిత్ రెడ్డి, సొంత నిధులతో డివిజన్ లో నివసిస్తున్నటువంటి దినసరి కూలీలకు దాదాపు 1000 మందికి కూరగాయలను గుడ్లు,ఆహార ప్యాకెట్లను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా ప్రభావంతో, ఒక్క పేద వ్యక్తి ఆకలితో పస్తులు వుండకూడదు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ,కె.టి.ర్ పిలుపు మేరకు ప్రతి ఒక్క నాయకుడు పేదల మద్య వుంటూ వారిని ఆదుకోవడం జరుగుతోందని , అలాగే రంజాన్ మాసం మొదలైన సందర్భముగా ముస్లిం మైనారిటీ సోదరులు ఇళ్లలోనే ఉండి, నమాజ్ చేసుకోవాలని స్వీయనియంత్రణ పాటిస్తూ, ఇళ్లకే పరిమితం అవ్వాలని 15 రోజులు ఇలాగే, మనం ఉంటే కరోనా మహమారిని జయించి కరోనా లేని రాష్ట్రము అవుతుందని అన్నారు.