తెలంగాణా లో జూన్ నుంచి సినిమా షూటింగులు : వెల్లడించిన సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

తెలంగాణా లో జూన్ నుంచి సినిమా షూటింగులు : వెల్లడించిన సీఎం కేసీఆర్


లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. సినీ రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లతోపాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, జెమిని కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు సీఎంను కలిసిన వారిలో వున్నారు. సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.