ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. మాస్కు లేకుండా బయటకు.. నెటిజన్లు ఫైర్! - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. మాస్కు లేకుండా బయటకు.. నెటిజన్లు ఫైర్!

ఎంఐంఎం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నెటిజన్లు మరోసారి టార్గెట్ చేశారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం.. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా అక్బర్దుదీన్ ఒవైసీ ఈ నిబంధనను ఉల్లంఘించారు. బిహార్ వెళ్తున్న వలస కూలీలు ఉన్న ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే.. మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.బస్సులో ఉన్నవారు, ఎమ్మెల్యే పక్కన ఉన్న వారంతా మాస్కులు ధరించగా.. అక్బరుద్దీన్ మాత్రం మాస్క్ ధరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొందరు.. ఎమ్మెల్యేకు మాస్క్ లేదు. మరి ఆయనకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Post Top Ad