వరంగల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా : రోజు రోజుకు పెరుగుతున్న కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

వరంగల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా : రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 36 (వరంగల్ అర్బన్ - 27, భూపాలపల్లి -3, ములుగు - 2, జనగాం - 3, మహబూబాబాద్ - 1 , వరంగల్ రూరల్ - 0 ) కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ లో 23 , ములుగులో 2 , జనగామలో 1 ,భూపాలపల్లిలో 3, మహబూబాబాద్ లో 1 డిశ్చార్ట్ అయ్యారు. ఆదివారం తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082 కి చేరింది. ఆదివారం మరో 46 మంది కొత్తగా డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 545 మంది డిశ్చార్జ్ కాగా, కరోనా కారణంగా 29 మంది మృతి చెందారు. ప్రస్తుతం 508 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అయితే గత 14 రోజుల నుంచి భూపాలపల్లి,ములుగు,మహబూబాబాద్ జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఉమ్మడి జిల్లాకు కొంచెం ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవాలి.

Post Top Ad