హైదరాబాద్ మహా నగరంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

హైదరాబాద్ మహా నగరంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు నమోదు

1588661350657619-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - తెలంగాణ) : తెలంగాణలో ఆదివారం రోజు కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. మొత్తంగా ఇప్పటి వరకు 1082 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు. కరోనా వైరస్ నుంచి తాజాగా 46 మంది డిశ్చార్జ్ అయి.. ఇంటికి వెళ్లారు. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 545 మంది డిశ్చార్జ్ అయితే, మరో 508 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 మంది చనిపోయారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికొస్తే కరోనా ఇప్పట్లో నగరాన్ని వదిలేలా కనిపించడం లేదు. ఆదివారం నమోదైన 21 కేసుల్లో 20 కేసులు హైదరాబాద్ లో నమోదైతే, రెండు ఒక్క కేసు జగిత్యాల జిల్లాలో నమోదు అయ్యాయి. రోజురోజుకు గ్రేటర్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నగరవాసులతో పాటు అధికారుల్లో టెన్షన్ అంతకు అంతకూ పెరుగుతోంది. దాదాపు 40 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద పూర్తిగా అష్టదిగ్బందనంలో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన జిల్లాల్లో అంక్షలు సడలించినా కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం అంక్షలను సడలించలేదు. దీంతో ఈ నెల 5న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పైనే నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు.

Post Top Ad