నాచారంలోని ఈఎన్ఏ నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రిలో అత్యంత అధునాతన వైద్య సౌకర్యాలు, నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఉన్నందున అతి త్వరలో పనులు
పూర్తిచేసి కరోనా బాధితుల కోసం రిజర్వులో ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మెడల మల్లికార్జున్ గౌడ్, కార్పొరేటర్ శాంతి, మరియు అధికారులు పాల్గొన్నారు.