పోలీసులను సన్మానం చేసిన వికారాబాద్ ఎం.ఎల్.ఎ డాక్టర్ ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 26, 2020

పోలీసులను సన్మానం చేసిన వికారాబాద్ ఎం.ఎల్.ఎ డాక్టర్ ఆనంద్


వికారాబాద్ లోని సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి సన్మానకార్యక్రమం ఏర్పాటుచేసారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ...  పోలీసు సిబ్బంది అంతా ఆరోగ్యాలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. వీరి సేవలు వెలకట్టలేనివి. సమాజంలో ఉన్న మనమందరం వీరందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మనమంతా ఏంఇచ్చినా తక్కువేనని, కరోనా నిర్మూలనకు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాత్రీపగలు తేడాలేకుండా పోలీసులు అందించే సేవలు ప్రశంసనీయమని MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అన్నారు. గారు అన్నారు.

DSP సంజీవరావు, వికారాబాద్ CI శ్రీనివాస్, ధారూర్ CI రాజశేఖర్, CI ప్రమీల గార్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాలకు తెగించి మనకోసం కష్టపడుతున్న పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేయడం నాకు సంతోషంగా ఉంది అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో DSP సంజీవరావు గారు, CI లు ప్రమీల గారు, శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, దాసు గారు, RI శీనయ్య గారు, PACs ఛైర్మెన్ ముత్యంరెడ్డి గారు, trs టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, trs వికారాబాద్ మండల ప్రెసిడెంట్ కమాల్ రెడ్డి, చిగుల్లపల్లి రమేష్ గారు, PACS వైస్ చైర్మన్ పాండు గారు, 15 వ వార్డు కౌన్సిలర్ అనంత్ రెడ్డి, 8 వ వార్డు కౌన్సిలర్ గోపాల్, 21 వ వార్డు కౌన్సిలర్ కృష్ణా రెడ్డి గారు, లక్ష్మణ్, నర్సింలు, వేణుగోపాల్, సుబాన్ రెడ్డి, గిరీష్ కోటారి గారు, టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.