అనుమానితులకు వైద్య పరీక్షలు చేయడంలో ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి : బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 24, 2020

అనుమానితులకు వైద్య పరీక్షలు చేయడంలో ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి : బండి సంజయ్

తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో గోప్యత పాటించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కూడా కనీసం వైద్య పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేయడంలో ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కరోనా పరీక్షలు చేయకపోవడం వల్లే తొలుత కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కరోనా తీవ్రతను గుర్తించి కరోనా పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.
అంతేకాక, గాంధీ ఆస్పత్రిలో ఆచూకీ తెలియకుండా పోయిన మధుసూదన్ వ్యవహారంపైనా బండి సంజయ్ జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం మెరుపులాగా అప్పుడప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడి పోతారని ఎద్దేవా చేశారు. విలేకరులు ఏదైనా ప్రశ్నలడిగితే తిడతారని అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఎంతో తేడా ఉందని చెప్పారు.