కరోనా వ్యాధికి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్ కు సన్మానం... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

కరోనా వ్యాధికి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్ కు సన్మానం...


శుభ తెలంగాణ (04 ,మే , 2020 - మన్సూరాబాద్ ) : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని మధుర నగర్ కాలనీలో కరోనా వ్యాధికి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్. బడుగు బాలకృష్ణ, డాక్టర్. బడుగు అరుణ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కొప్పుల నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ... డాక్టర్ బడుగు బాలకృష్ణ, అరుణ రామాంతపూర్ ఐసోలేషన్ వార్డులో మరువలేని కరోనా వ్యాధి పేషంట్లకు సేవలు అందిస్తున్నారని ప్రపంచాన్ని సైతం ఈ కరోనా మహమ్మారి వైరస్ వ్యాధి విజృంభిస్తున్న కష్టకాలంలో కుటుంబాలకు దూరమై తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్యం అందిస్తున్న దేవుళ్లు డాక్టర్లు, నర్సులని అని కొనియాడారు.