మొబైల్ ఏటీయం సేవలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

మొబైల్ ఏటీయం సేవలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్


శుభ తెలంగాణ(5, ఏప్రిల్ , 2020 - హైదరాబాద్ )  : లాక్‌డౌన్‌ వేల ప్రజలకు డబ్బు అందుబాటులో ఉంచడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త యోచన చేసింది. మొబైల్ ఏటీయం ఏర్పాటు చేసి, నగరమంతా తిప్పాలని నిర్ణయించింది. దీన్ని రాజ్‌భవన్‌లో ఈ ఏటీయం సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తొలిగా ఏటీయం నుంచి డబ్బు డ్రా చేశారు. ఆ తర్వాత గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్.. ఈ ఏటీయం సేవలను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఒకరొకరుగా రాజ్‌భవన్‌లో పనిచేసే 80 మంది ఉద్యోగులు ఏటీయం నుంచి సుమారు రూ.5లక్షలు విత్‌డ్రా చేశారు.